వీటో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న చైనా

 

భారత్ లో జరిగిన  పఠాన్‌కోట్‌ దాడికి సూత్రధారి అయిన మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్‌ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించిన నేపథ్యంలో చైనా ప్రతిసారీ ఆ తీర్మానానికి అడ్డుపడుతున్నది. భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశం అయిన చైనా తనకు గల వీటో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ తీర్మానానికి గండి కొడుతోంది. మసూద్‌ అజర్‌ విషయంలో చైనా  నిస్సందేహంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భారత రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భద్రతామండలిలోని 1267 నిషేధాల కమిటీ ముందు అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైనా దానిని వరుసగా నాలుగోసారి కూడా అడ్డుకుంది.
ఐక్యరాజ్య సమితిలో చైనా తీరు వల్ల భారత్‌తో ఆ దేశ సంబంధాలు ప్రమాదకరస్థాయిలో పడుతున్నాయని  రక్షణ శాఖ నిపుణులు పీకే సింగ్‌ తెలిపారు. భారత్‌తో అనుబంధాన్ని చైనా వద్దని అనుకుంటోంది అని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం విషయంలో చైనా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు ఇదొక తార్కాణమని మరో నిపుణుడు రాహుల్‌ జలాల్‌ అన్నారు. మసూద్‌ అజర్‌ విషయంపై చైనా విదేశాంగ శాఖ కార్యదర్ధి హు చునియాంగ్‌ మాట్లాడుతూ.. మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో కొన్ని అభిప్రాయబేధాలున్నాయని చెప్పారు.  ఈ విషయమై భారత్‌ చాలా అంశాలకు వివరణ ఇవ్వలేదని ఆరోపించారు.

Facebook
Twitter
Please reload

​సంబంధిత సమాచారం 
Please reload

ముఖ్యాంశాలు

సరిహద్దుల్లో చైనా ఆగడాలు

May 12, 2020

1/10
Please reload

తాజా వార్తలు
Please reload

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836