అసంఘటిత రంగ కార్మికులకు ధీమా.. చంద్రన్న బీమా


అసంఘటితరంగ కార్మికుల జీవితాలకు ధీమా కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చంద్రన్న బీమా ప్రవేశపెట్టారని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి తెలిపారు. దీనిలో కార్మికులందరూ చేరాలన్నారు. భవననిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని అసంఘటితరంగ కార్మికుల సంక్షేమం కోసం వినియోగించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు కేంద్రప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. రూరల్‌ నియోజకవర్గం నుండి చంద్రన్న బీమా పధకంలో చేరిన వారికి బాండ్లను ఎంపి మాగంటి మురళీమోహన్‌తో కలిసి గోరంట్ల బుచ్చియ్యచౌదరి అందచేశారు. డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, జన్మభూమి మండల కమిటీ చైర్మన్‌ మార్ని వాసు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు