అసెంబ్లీ బహిష్కరణ అనుచితం... వైకాపా కు  రాజేశ్వరి  గుడ్ బై


అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని జగన్‌ తీసుకున్న నిర్ణయం సరికాదని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి స్పష్టం చేసారు. ఆమె శనివారం వైకాపాను వీడి తెలుగుదేశంలో చేయరు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆయన నివాసంలో శనివారం ఉదయం కలిసి తన అనుచరులతో సహా తెదేపాలో చేరిపోయారు. ఈమెతో సహా ఇప్పటి వరకూ వైకాపాను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 22కి చేరింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను తెదేపాలో చేరినట్లు రాజేశ్వరి తెలిపారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.

ముఖ్యాంశాలు