పుల్లా వీర వెంకట్రావుకు జాతీయ ఉద్యానవన ప్రతిభ పురస్కారం


రాజమహేంద్రవరం : ఐఎన్‌ఏ ప్రధాన కార్యదర్శి, శ్రీ సత్యదేవ నర్సరీ (కడియపులంక) అధినేత పుల్లా వీర వెంకట్రావు ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఇటీవల కర్ణాటక తెలుగు సంఘ్‌ ఆడిటోరియంలో, ఆల్‌ ది బెస్ట్‌ అకాడమీ (యుఎస్‌ఏ) వారి సౌజన్యంతో డాక్టర్‌ పి.చంద్రశేఖరరావు (జడ్జ్‌ ఎట్‌ ది ఇంటర్నేషనల్‌ ట్రిబ్యునల్‌ ఫర్‌ ది లా) నుండి జాతీయ ఉద్యానవన ప్రతిభా పురస్కారం అందుకున్నారు. నర్సరీ రూరల్‌ పుల్లా వీర వెంకట్రావు చేసిన కృషికి గాను ఈ పురస్కారం లభించింది. ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ కె.లింగరాజు మాట్లాడుతూ గతంలో ఉద్యానరత్న, హరితరత్న, మెగా నర్సరీమెన్‌ అవార్డు, మదర్‌థెరిస్సా అవార్డు వంటి అత్యుత్తమ పురస్కారాలు అందుకోవడమే కాకుండా, ప్రస్తుతం జాతీయ ఉద్యానవన ప్రతిభా పురస్కారం అందుకుని కడియం నర్సరీల ఖ్యాతిని మరింత పుల్లా మరింత పెంచారని కొనియాడారు. ఐఎన్‌ఏ అధ్యక్షులు పల్ల సుబ్రహ్మణ్యం, కెఎన్‌ఏ సెక్రటరీ బోర్సు సుబ్బారాయుడు, ఐఎన్‌ఏ ట్రెజరర్‌ తాడాల రవికుమార్‌, రావిపాటి రామకృష్ణ, నర్సరీ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. ఐఎన్‌ఏ ప్రధాన కార్యదర్శి పుల్లా వీర వెంకట్రావు జాతీయ ఉద్యానవన ప్రతిభా పురస్కారం అందుకున్న సందర్భంగా సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. నర్సరీ అసోసియేషన్‌ అధ్యక్షులు పుల్లా సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం