వైకాపా బంద్ విజయవంతం .. రాజాపై వెల్లువెత్తిన సానుభూతి

Rajamahendravaram

 

 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజాపై దాడి చేసిన ఎస్‌ఐను సస్పెండ్‌ చేయాలనే డిమాండ్ తో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన రాజమహేంద్రవరం బంద్‌ ప్రశాంతంగా జరిగింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి.  చాంబర్‌  తీర్మానం మేరకు వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు కోటగుమ్మం సెంటర్‌కు చేరుకుని కోటిపల్లి బస్టాండ్‌ వరకు ర్యాలీ చేశారు. పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, గ్రేటర్‌ అధ్యక్షులు కందుల దుర్గేష్‌, ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిళారెడ్డి,పార్టీ ప్రధాన కార్యదర్శి దంగేటి వీరబాబు, ఇతర నాయకులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఎస్‌ఐ నాగరాజును తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలాఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు, చలమలశెట్టి సునీల్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా రాంబాబు  మాట్లాడుతూ  పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయో లేవో తెలియడం లేదని  ధ్వజమెత్తారు. ఎస్‌.ఐ ని సస్పెండ్‌ చేయకపోతే జిల్లాకి చెందిన హోమ్‌ మంత్రి ఉన్నా లేకున్నా ఒకటే అని తెలిపారు. పార్టీ సమన్వయకర్త కావాటి మనోహర్‌ నాయడు, సుంకర చిన్ని, అడపా హరి, ముత్యాల సతీష్‌ తదితరులు పాల్గొన్నారు, ఇదిలా ఉండగా ఈ ఘటనలో వైకాపా నేత జక్కంపూడి రాజా పై జిల్లా వ్యాప్తంగా సానుభూతి నెలకొంది.