సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం కమ్మన్న చైనా

యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా సైన్యానికి ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. అయితే యుద్ధం ఎవరితో అన్నది మాత్రం ఆయన చెప్పలేదు. పోరాడే సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఆయన తెలిపారు. దీనిని చైనా అధికారిక మీడియా తెలిపింది. అత్యున్నత సైనిక అధికారులతో సమావేశమైన జిన్ పింగ్ ఇలా పిలుపునిచ్చారని పేర్కొంది. సెంట్రల్ మిలటరీ కమిషన్ అధీనంలో దాదాపు 23లక్షల చైనా సైన్యం ఉంది. ఈ కమిషన్ మొత్తంలో జిన్పింగ్ ఒక్కరే సైనికేతర సభ్యుడు. ఆయనే ఈ కమిషన్కు అధ్యక్షుడు. జిన్పింగ్ రెండోసారి గెలిచినా తర్వాత యుద్ధానికి సిద్ధమవ్వాలని చెప్పడం ఇది రెండో సారి.