35వ డివిజన్‌లో ఇంటింటికీ తెలుగుదేశం


రాజమహేంద్రవరం : స్థానిక 35వ డివిజన్‌లో కార్పొరేటర్‌ కరగాని మాధవి ఆధ్వర్యాన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిధులుగా ఎం.పి. మురళీమోహన్‌, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, తెదేపా యువనేత ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. పార్టీ పతాకాన్ని మురళీమోహన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మురళీమోహన్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక లోటుతో సతమతమవుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ముందుకు వెళుతున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఆయనకు అండగా నిలవాలని కోరారు. సమస్యల పరిష్కారంలో సాధ్యాసాధ్యాలను ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరోవైపు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని తెలిపారు. గోరంట్ల మాట్లాడుతూ విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం అథికంగా నిధులు కేటాయిస్తోందని అన్నారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబునాయుడు పడుతున్న కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర పంచాయితీ, ఐటి శాఖామంత్రి నారా లోకేష్‌ ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. త్వరలో చేతి వృత్తుల వారికి ఆదరణ పథకం క్రింద పరికరాలను పంపిణీ చేయనున్నారని తెలిపారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి, యర్రా వేణుగోపాలరాయుడు, చల్లా శంకరరావు, తదితరులు తెదేపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు. అనంతరం ఇంటింటికీ వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, రెడ్డి పార్వతి, గాదిరెడ్డి బాబులు, మాటూరి రంగారావు, తంగెళ్ళ బాబి, సింహ నాగమణి, కోరుమిల్లి విజయశేఖర్‌, కో-ఆప్షన్‌ సభ్యులు చాన్‌ భాషా, పార్టీ నాయకులు శెట్టి జగదీష్‌, సూరంపూడి శ్రీహరి, కరగాని వేణు, మేరపురెడ్డి రామకృష్ణ, కొండేటి సుధాకర్‌, అట్టాడ రవి, మానే దొరబాబు, విశ్వనాథరాజు, మహబూబ్‌ జాని, టేకుమూడి నాగేశ్వరరావు, పెనుగొండ రామకృష్ణ, మరుకుర్తి దుర్గా యాదవ్‌, కర్రి రాంబాబు, వెలమ దుర్గాప్రసాద్‌, పొదిలాపు నాగేంద్ర, వెలమ పద్మజ, సప్పా రమణ, పుట్టా సాయిబాబు, మిస్కా జోగినాయుడు, గాడి శ్రీను, దమర్‌సింగ్‌ బ్రహ్మాజీ, మోతా పండు, రాయి అప్పన్న, జాగు వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం