అవినీతిపై సౌదీ రాజు దాడి.. యువరాజులనూ వదల్లేదు


సౌదీ అరేబియా రాజు మహమ్మద్‌ బీన్‌సల్మాన్‌ రాజకుటుంబానికి చెందిన 11 మంది యువరాజులతోపాటు అనేక మంది మాజీ మంత్రులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు ప్రభుత్వం వారిని అరెస్టు చేసి వారి బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసింది. ఉన్నత స్థాయి అవినీతి వ్యతిరేక కమిటీ వారిని దోషులుగా తేల్చిన నేపథ్యంలో జాతీయ భద్రతాదళానికి నేతృత్వం వహించే యువరాజుతోపాటు ఆర్థిక మంత్రిని కూడా సౌదీరాజు తొలగించారు. అవినీతికి వ్యతిరేకంగా నూతన కమిటీ ఏర్పాటు చేశారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో 2009లో సంభవించిన వరదలు, కొన్నేళ్లుగా విజృంభిస్తున్న ఎంఈఆర్‌ఎస్‌ వైరస్‌ కారణంగా వందలాది మంది చనిపోయారు. వీటిపై దర్యాప్తు జరిపే క్రమంలోనే యువరాజులు, మాజీ మంత్రుల వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో మండిపడిన రాజు కఠిన చర్యలకు దిగారని వార్తాసంస్థల కథనం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం