జనంతో మమేకానికి జగన్ స్పీక్స్


ప్రజాసంకల్పయాత్ర నేపథ్యంలో జగన్‌ మోహన్ రెడ్డి సోషల్‌ మీడియాలో నెటిజన్లతో మమేకమయ్యేందుకు 'జగన్‌ స్పీక్స్‌' పేరుతో వీడియో సిరీస్‌ ప్రారంభించారు. పాదయాత్ర అనుభవాలను ఈ ప్రోగ్రాం లో నెటిజన్లతో

ఆయన పంచుకుంటారు. ఆదివారం సాయంత్రం వైఎస్‌ జగన్‌ తన అధికారిక ఫేస్‌ బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసిన 'జగన్‌ స్పీక్స్‌' తొలి వీడియోకు విశేష స్పందన లభించింది. ప్రజా సంకల్పయాత్ర సోమవారం నుంచి ప్రారంభిస్తున్నానని ఆయన ఈ తోలి వీడియోలో చెప్పారు. వైఎస్‌ఆర్‌ కుటుంబం ద్వారా తనతో భాగస్వాములైనందుకు కృతజ్ఞతలు చెప్పారు. 6 నుంచి 7 నెలలు దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా సాగే ఈ పాదయాత్రతో అందరికీ మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ప్రజల కష్టాలను పరిష్కరించే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేస్తానని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రజలు దిద్దిన మేనిఫెస్టోలా బయటకు రావాలన్నది తన అభిమతం అన్నారు. ప్రజలంతా పాదయాత్రలో భాగస్వాములు అవ్వాలని ఆయన కోరారు.