జీవన శైలిలో మార్పులే అనారోగ్యానికి మూలం


జీవనశైలిలో వస్తున్నా మార్పులే దేశంలో అనారోగ్య పరిస్థితులకు మూలమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరులో స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. తినే తిండి, చేసే పనుల్లో వచ్చిన వ్యత్యాసాల వలన అంతుతెలియని రోగాల బారిన ప్రజలు పడుతున్నారన్నారు. దేశంలో ప్రతి 1700 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నాడని, ఇది దేశంలో వైద్య విద్య అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోందని తెలిపారు. సమాజ చైతన్యం లక్ష్యంగా పనిచేస్తున్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ సేవలను ఆయన అభినందించారు. సామాజిక సేవలో తన కుమార్తె ముందుండడం గర్వంగా ఉందని చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమానికి మంత్రులు కామినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమా హాజరయ్యా

ముఖ్యాంశాలు