నవంబర్ 28, 29న హైదరాబాద్ లో ఇవాంకా ట్రంప్

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ నవంబర్ 28, 29న హైదరాబాద్‌లో పర్యటిస్తారు. జీఈఎస్ (గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమిట్)లో పాల్గొనేందుకు ఇవాంకా హైదరాబాద్ రానున్నారు. ఆమె కోసం తాజ్ ఫలక్‌నుమాలో డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు. మాదాపూర్‌లోని రహేజా మైండ్ స్పేస్‌లో ఆమె బస చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు, అమెరికాకి చెందిన సీక్రెట్ సర్వీస్ బృందంతో కలిసి ఫలక్నుమాను సందర్శించారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌కు అనుసంధానంగా ఉన్న మార్గాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత కోసం ‘ఆక్టోపస్’ కూడా బరిలోకి దిగుతున్నది.