ప్రధానిపై నిప్పులు చెరిగిన రాహుల్


కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక విధానాలను ఆయన గట్టిగా తప్పుపట్టారు. ఉపయోగంలేని ప్రసంగాలను, పస లేని ప్రయోగాలను ఆపాలని ఎద్దేవా చేశారు. అధిక ధరకు వంటగ్యాసు, ఖరీదైన రేషన్‌.. ఉపయోగంలేని ప్రసంగాలను ఆపండి! ధరలను తగ్గించండి, ఉద్యోగాలు ఇవ్వండి.. లేదంటే ఆ పదవి నుంచి తప్పుకోండి.’ అని రాహుల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం గత 16 నెలల్లో 19 సార్లు వంటగ్యాసు ధర పెంచింది. దీన్ని విమర్శిస్తూ రాహుల్‌ ఈ విధంగా ట్వీట్‌ చేశారు.