రియాద్ ఎయిర్ పోర్ట్ పై యెమన్ క్షిపణి దాడి.. దారిలోనే కూల్చేసిన పేట్రియాట్


సౌదీ అరేబియాలోని రియాద్‌ విమానాశ్రయం లక్ష్యంగా యెమన్‌లోని హౌతీ రెబల్స్‌ క్షిపణి దాడికి పాల్పడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.07కు యెమన్‌ రెబల్స్‌ క్షిపణిని ప్రయోగించారు. ఇది రియాద్‌ వైపు దూసుకువస్తుండగా సౌదీ పేట్రియాట్‌ రక్షణ వ్యవస్థ స్పందించి ఈ శత్రు క్షిపణిని దారిలోనే కూల్చివేసింది. సౌదీలోని అత్యంత కీలకమైన రియాద్‌ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా క్షిపణిదాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ క్షిపణి దాడిని తామే చేశామని యెమన్‌లోని హౌతీ ఆధీనంలోని ప్రభుత్వ మంత్రి ఒకరు ప్రకటించారు. సౌదీ రాజధానిని షాక్‌కు గురిచేయడానికే ఈ దాడి చేసినట్లు చెప్పారు. ఇటీవల యెమన్‌ రాజధాని సనాపై సౌదీ సంకీర్ణదళాల దాడికి ప్రతీకారంగా రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. కాగా రియాద్‌ విమానాశ్రయం సురక్షితంగా ఉందని సౌదీ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడి వల్ల విమానాల రాకపోకల్లో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది.

ముఖ్యాంశాలు