వియత్నాంలో దామ్రే తుపాను బీభత్సం.. 27 మందికి పైగా మృతి


వియత్నాంలో దామ్రే తుపాను బీభత్సం సృష్టిస్తోంది. 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో 27 మందికి పైగా మృతి చెందారు. వందల సంఖ్యలో జనం గల్లంతైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తుండడంతో 40 వేల ఇళ్లు కూలిపోయినట్టు సమాచారం. తుపాను తీవ్రత ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. కాగా వియాత్నం లో ఎపెక్ సమ్మిట్‌ జరగనుంది. దీనికి హాజరు కానున్న ప్రపంచ దేశాల నేతలు ఇపుడు వియాత్నం వెళ్ళడానికి పునరాలోచనలో పడ్డారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వియత్నాం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తుపాను ధాటికి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు అంధకారంలో ఉన్నారు.