అరుణాచల్ ప్రదేశ్ వెళ్లకూడదట.. చైనా తెంపరితనం


భారత రక్షణమంత్రి నిర్మలాసీతారామన్‌ అరుణాచల్‌ప్రదేశ్‌ పర్యటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన తెంపరి తనాన్ని చాటుకుంది. అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్‌లోని అంజ్యా జిల్లాలోని కిబుతు సైనిక స్థావరాన్ని నిర్మలా సీతారామన్‌ ఆదివారం సందర్శించారు. చైనా సరిహద్దు వెంబడి ఉన్న ఈ శిబిరాన్ని సందర్శించడం భారత్ కి తగదని చైనా అభ్యంతరం తెలిపింది. వివాదాస్పద ప్రాంతంలో ఇలాంటి

పర్యటనలు శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తాయని ఆరోపించింది. భారత్‌, చైనా మధ్య అరుణాచల్‌ప్రదేశ్‌ విషయమై విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. అరుణాచల్‌ దక్షిణ టిబెట్‌లో భాగమే అని చైనా అడ్డంగా వాదిస్తున్నది. ఈ దిక్కుమాలిన వాదనకి బలం చేకూర్చుకోవడం కోసం భారత్‌ నుంచి ఉన్నతాధికారులు ఎవరైనా అక్కడ పర్యటిస్తే చాలు చైనా ఇలాగే తప్పుబడుతూ వస్తోంది.

ముఖ్యాంశాలు