ఇందిర జాతి ప్రయోజనాలు విస్మరించారు

పెద్ద నోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 8వ తేదీన దేశవాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించ తలపెట్టిన నిరసన, ఆందోళనల నేపథ్యంలో ప్రధాని

తీవ్రంగా స్పందించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కులు లో జరిగిన ఎన్నికల సభల్లో మోదీ మాట్లాడుతూ ఆయన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వైఫల్యాన్ని ప్రస్తావించారు. దేశానికి అవసరమైనప్పుడు నోట్లను రద్దు చేయకుండా ఇందిరాగాంధీ ఆనాడు మిన్నకున్నారని ఆరోపించారు. అప్పుడే ఇందిరాగాంధీ ఈ చర్య చేపట్టి ఉంటే తనకు పెద్దనోట్లను రద్దు చేయాల్సిన అవసరమే ఉండేది కాదన్నారు. నాడు చవాన్‌ సారథ్యంలోని నిపుణుల సంఘం సిఫారసు చేసినప్పటికీ ఇందిరాగాంధీ అందుకు తిరస్కరించారన్నారు. జాతి కంటే తన పార్టీ ప్రయోజనాలకే అప్పట్లో ఇందిర ప్రాధాన్యత ఇచ్చారని ఆయన విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం సుమారు 3 లక్షలకు పైగా కంపెనీలు మూతపడ్డాయని ప్రధాని చెప్పారు. వాటిలో 5 వేల సంస్థల విషయంలో నిర్వహించిన దర్యాప్తులో సుమారు రూ.4వేల కోట్ల మేరకు అవకతవకలు జరిగినట్లు సుస్పష్టమైందన్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది కాంగ్రెస్‌ పార్టీకి కంటిమీద కునుకు అన్నది లేకుండా చేసిందన్నారు. ఆ ప్రభావంతో పడిన ఇబ్బంది కారణంగానే వారికి కోపం వచ్చిందన్నారు. నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలకి తాను భయపడే ప్రసక్తే లేదని మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చుపెడితే గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నది 15 పైసలు మాత్రమేనని దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ చేసిన దాని గురించే ఆయన మాట్లాడి ఉంటారన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం