చర్చిలో కాల్పులు ... 27 మంది మృతి


ఆదివారం అమెరికాలోని టెక్సాస్‌లో ఓ చర్చి నెత్తురు చిందింది. సుదర్లాండ్‌ స్ప్రింగ్స్‌ ఫస్ట్‌ బాప్టిస్ట్‌ చర్చిలో ఉదయం 11.30 గంటల వేళ సుమారు 50 మంది ప్రార్థనల్లో మునిగి ఉన్నారు. ఇంతలో ఒకడు లోపలికి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రెండేళ్ల చిన్నారితో సహా 27 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఆగంతుకుడు సైనిక దుస్తుల్లో వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం పారిపోతున్న ఆగంతుకుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం