ట్రంప్ నోట బహు మంచి మాట


జపాన్‌ పర్యటనలో ఉన్నఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఉత్తకొరియాతో తాను చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్‌ ఈ మాట చెప్పారు. ‘నేను ఎవరితోనైనా చర్చలు జరిపేందుకు సిద్ధమే. చర్చలు బలం లేదా బలహీనత అని నేను అనుకోవడం లేదు’ అని అయన అన్నారు. ఉత్తరకొరియా ప్రజలు గొప్పవారని, అయితే వారు పాలనా పరమైన అణచివేతకు గురవుతున్నారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అనంతరం జపాన్ ప్రధానితో సంయుక్త సమావేశంలో భాగంగా కయ్యాలమారి ఉత్తరకొరియా విషయంలో సహనం నశించిందని ట్రంప్‌ స్పష్టం చేసారు. ఉత్తరకొరియా దూకుడుకు కళ్లెం వేసే విషయమై ఆ దేశ ప్రధాని షింజో అబేతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా అమెరికా వైఖరికి జపాన్ పూర్తి మద్దతు పలికింది. ‘ఉత్తరకొరియాపై సహనం నశించింది. ఆ దేశ అణు పరీక్షలు యావత్‌ ప్రపంచానికి, అంతర్జాతీయ శాంతికి పెను ముప్పు అని ట్రంప్‌ మండిపడ్డారు. ఉత్తరకొరియా విషయంలో అమెరికా నిర్ణయాలకు జపాన్‌ మద్దతిస్తుందని అబే తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం