అవినీతిపరుల తుట్టెను కదిపిన పారడైజ్ పత్రాలు


ప్యారడైజ్‌ పత్రాలు దేశంలోని అనేకమంది అవినీతిపరుల చరిత్రను కదిపాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో మూడో కంటికి తెలియకుండా పెద్దలు పెట్టిన పెట్టుబడులు, పన్నుల ఎగవేతలు, డొల్ల కంపెనీలు వెలుగులోకి రావడం ప్రకంపనల్ని సృష్టించింది. అమెరికా, ఇంగ్లాండ్‌, రష్యా, పాకిస్థాన్‌ వంటి దేశాలకు చెందిన ప్రముఖులతో పాటు మనదేశానికి చెందిన 700 మందికి పైగా ప్రముఖుల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నాయి. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌మాల్యా, కార్పొరేట్‌ దళారీ నీరా రాడియా, కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా, హైదరాబాద్‌కు చెందిన హెటెరో డైరెక్టర్లు- వెంకట నరసారెడ్డి, పార్థసారథిరెడ్డి , బిజెపి ఎంపీ రవీంద్ర కిషోర్‌(ఆర్‌కే) సిన్హా.తదితరుల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఎదుర్కొంటున్న సీబీఐ కేసులలో తాజా ఆర్థికలంకెలు ఈ పత్రాల్లో ఉన్నట్లు కూడా వెల్లడయింది. సన్‌ టీవీ- ఎయిర్‌సెల్‌- మ్యాక్సిస్‌ కేసు, ఎస్సార్‌-2జి కేసు, రాజస్థాన్‌ అంబులెన్సుల కుంభకోణం... ఇలాంటివాటితో సంబంధం ఉన్నవారి పేర్లు వీటిల్లో ఉండడం విశేషం. అనేక కార్పొరేట్‌ కంపెనీల పేర్లూ జాబితాలో ఉన్నాయి. పనామా పత్రాల కేసులో ఉన్న పేర్లలో కొన్ని ఈ పత్రాల్లోనూ ఉన్నాయి. రాజకీయ నాయకులు, కార్పొరేట్లు, సినీతారల పేర్లు బయటకు రావడంతో బహుళ సంస్థలతో దర్యాప్తు జరిపించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. 95 మీడి

యా సంస్థల భాగస్వామ్యంతో వేర్వేరు దేశాల్లో శోధించి, 1.34 కోట్ల లీకైన దస్త్రాలను పరిశీలించినట్లు అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల సమాఖ్య (ఐసీఐజే) వెల్లడించింది. యాపిల్‌, నైకీ, ఉబర్‌ వంటి సుమారు 100వరకు బహుళజాతి సంస్థల ‘పన్ను ప్రణాళిక’ల వివరాలనూ ప్యారడైజ్‌ పత్రాలు బయటకు తెచ్చాయి.ప్యారడైజ్‌ పత్రాలు ఇటు రాజకీయంగానూ కలకలం సృష్టించాయి.

ముఖ్యాంశాలు