కేంద్ర మంత్రి ఓరం ... ఇదేమి అహంకారం ?


మంత్రి బూట్లు మోస్తున్న ఉద్యోగి

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం అధికారులతో తన బూట్లు మోయించారు. రాయగడ జిల్లాలో శివాలయం వద్ద ఇలా షూస్‌ మోయించిన ఘటన కెమెరాలో చిక్కింది. ఈ వీడియో ఫుటేజీలు బయటికి రావడం చర్చనీయాంశమైంది. మంత్రి జువల్‌ ఓరంతో పాటు సీనియర్‌ నేతలు పార్టీ సమావేశానికి హజరు కావడానికి వెళ్లారు. సమావేశం జరిగే కమ్యూనిటీ హాల్‌కి దగ్గర్లో శివాలయం ఉంది. సమావేశానికి ముందు మంత్రి, నేతలు, ఇతర అధికారులు బూట్లు బయట విడిచి దేవాలయ దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం అందరూ చెప్పులతో కమ్యూనిటీ హాల్‌కు బయలుదేరారు.మంత్రి ఓరం మాత్రం బూట్లు వేసుకోకుండానే వెళ్లగా ఆయన ఉద్యోగి వాటిని పట్టుకొని వెనక నడిచాడు. ఇలాంటి వివాదాలు ఓరం కి కొత్త కాదు. గతంలో పార్టీ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌ సమయంలో తన సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌పై చేయి చేసుకోవడం పై రగడ తెలిసిందే.

ముఖ్యాంశాలు