గుజరాత్ లో భారీగా బంగారం, డబ్బు పట్టివేత


గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈసీ విస్తృత తనిఖీలు చేస్తున్నది. ఇందులో భాగంగా భారీగా బంగారం, నగదు స్వాధీనం అయ్యాయని ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్‌ 5వ తేదీ వరకు రాష్ట్రంలో రూ.20లక్షల నగదుతో పాటు రూ.7.33 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వారు పేర్కొన్నారు. కొద్దిమొత్తంలో విదేశీ కరెన్సీ, 3.08లక్షల లీటర్ల మద్యాన్ని కూడా పట్టుకున్నామన్నారు. డిసెంబర్‌ 9, 14 తేదీల్లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు డిసెంబర్‌ 18న వెలువడనున్నాయి.

ముఖ్యాంశాలు