ట్రంప్‌కు వేలు చూపిస్తే ఏమవుతుంది?

సైకిల్‌పై వెళ్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వేలు చూపించిన మహిళ తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. అయితే ఆమెదేమీ ప్రభుత్వ ఉద్యోగం కాదు. వర్జీనియాకు చెందిన అకీమా అనే కాంట్రాక్టర్ వద్ద మార్కెటింగ్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్‌గా ఆరు నెలలుగా ఆమె పనిచేస్తోంది. ఆమెను తొలగిస్తూ సదరు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. జూలీ బ్రిస్క్‌మ్యాన్ అనే ఈ 50 ఏళ్ల మహిళ గత నెలలో స్టెర్లింగ్‌లో సైకిల్‌పై వెళుతుండగా ట్రంప్ తన కాన్వాయ్‌లో గోల్ఫ్ కోర్సుకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఆమె ముందుకు వెళ్లి మరీ తన చేతి మధ్య వేలిని ట్రంప్ కాన్వాయ్ వైపు చూపించింది. కాన్వాయ్ వెంట వెళ్తున్న ఓ ఫొటోగ్రాఫర్ ఈ ఫొటో సోషల్‌మీడియాలో పెట్టాడు. పలువురు నెటిజన్లు ఆమెను పొగుడుతూ కామెంట్లు కూడా పెట్టారు. ఇది తెలుసుకున్నఅకీమా యాజమాన్యం ఆమెపై మండిపడింది. ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా తమ పేరు దెబ్బతిందని పేర్కొంటూ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన బ్రిస్క్‌మ్యాన్ ప్రస్తుతం కొత్త ఉద్యోగం వెతుక్కుంటోంది. ఉద్యోగం పోయడం తనకేమీ బాధగా లేదని, పైగా తన నిరసన వ్యక్తపరిచినందుకు సంతోషంగా ఉందని చెప్పింది.