నిజాయితీ దిశగా దేశం ముందడుగు... డీ మోనిటైజేషన్


దొంగ నోట్లయినా ఫర్వాలేదు... అక్రమాలు ఎన్ని జరిగినా ఫర్వాలేదు.. వృద్ధి రేటు మాత్రం చాలు... ఇది లోగడ ప్రభుత్వ విధానం... నిజాయితీ అక్కర్లేదు.. జవాబుదారీ తనం అవసరం లేదు... పారదర్శకత అసలే ఉండదు.. అయినా సరే నా ఆదాయం బాగుంటే చాలు... ఇదీ అనేకమంది వ్యాపారుల నైజం.... ఇదీ ఒకప్పటి దేశం పరిస్థితి. ఈ దుస్థితి నుంచి బయట పడాలంటే చాలా సాహసం కావాలి, చాలా సహనం కావాలి. ముఖ్యంగా ఓట్ల రాజకీయం మర్చిపోవాలి. ఆ దిశగా చేసిన ప్రయత్నమే పెద్ద నోట్ల రద్దు (డీ మోనిటైజేషన్). ఇది ఇవాళ కాదు.... 1978 లో జరగాల్సిన సంస్కరణ. అపుడు రాజకీయాలకోసం విస్మరించారు.... రోగాన్ని ముదరబెట్టారు. ఓట్ల రాజకీయం కంటే దేశానికి సరైన దిశా దశ నిర్దేశించడమే ముఖ్యం అని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ సంచలన సంస్కరణను చేపట్టి అమలు చేసింది. ముదిరిన రోగానికి చేసే చికిత్స తక్షణ ఫలితాలను ఇచ్చేస్తుంది అని ఎలా అనుకుంటాం... ఇబ్బందులు ఉన్నాయి.. ఇంకా ఉంటాయి కూడా. కానీ ఇది నిజాయితీ దిశగా దేశ ప్రయాణం. ఇబ్బంది పడినా... కష్టపడినా సరే తల ఎత్తుకోగలం. గతంలో ఎంత సంపాదించినా... దొంగ బతుకే బతికారు చాలామంది. గత ఏడాది నవంబర్ 8 తర్వాత చాలామంది నిజాయితీ అనే జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఇబ్బందులే ఉన్నా సరే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం వాస్తవం చెప్పింది తప్ప మభ్యపెట్టే ప్రయత్నం చేయలేదు. ఇవేవీ అర్థం చేసుకోని... ఏమాత్రం బాధ్యత, దేశంపై ఆపేక్ష లేని కొన్ని రాజకీయ శక్తులు దీనిపై ఎంత బురద జిల్లాలో అంతా జల్లాయి... జల్లుతూనే ఉన్నాయి. ఇదిగో ఇపుడు బ్లాక్ డే అని కూడా నిస్సిగ్గుగా రోడ్ల పైకి వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తో ఈ పార్టీల విమర్శలు ఆగితే పోనీ అనుకునేవాళ్లం. కానీ వాళ్ళ హయాంలోనే ప్రక్రియమొదలైన జీఎస్టీ పైనా దుష్ప్రచారమే. అక్కడే కాంగ్రెస్ విశ్వసనీయతను మొత్తం కోల్పోయింది. నరేంద్ర మోదీ ఏమి చేసినా సరే వ్యతిరేకించడమే విధానం అని... దేశ ప్రయోజనాలకంటే తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని అనుకునే ప్రతిపక్షాలు దేశానికి భారంగా మారుతున్నాయి. ప్రజలు నమ్మడం లేదని తెలిసిన కూడా అవే అసత్యాలను మూడేళ్ళుగా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డుల్లా వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా వినిపిస్తూనే ఉంటాయి... 2019 ఎన్నికల వరకూ... పెద్దనోట్ల రద్దు వలన దేశం సర్వ నాశనం అయిపోయింది అని గత ఏడాది కాలంగా ప్రతి క్షణం ప్రజలను నమ్మించే