మౌనవ్రతంలో ఉన్నా.. ఆరోపణలపై తర్వాత మాట్లాడతా!


రాజ్యసభలో అత్యంత ధనవంతుడైన ఎంపీ ఎవరంటే రవీంద్ర కిషోర్‌(ఆర్‌కే) సిన్హా. ఈయన బిజెపి సభ్యుడు. ఈయన ఆధీనంలోని ప్రైవేటు సెక్యూరిటీ సేవల సంస్థ అయిన ఎస్‌ఐఎస్‌కు రెండు విదేశీ సంస్థలతో సంబంధం ఉన్న విషయం ప్యారడైజ్‌ పేపర్స్‌ ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చింది. మాల్టాలో ఎస్‌ఐఎస్‌ ఆసియా పసిఫిక్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ అనే సంస్థను 2008లో తన భారతీయ కంపెనీకి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేశారు. ఈ మాల్టా కంపెనీలో ఆయనతో పాటు ఆయన భార్య రీతా కిషోర్‌ సిన్హా కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. అంతేగాక ఈ కంపెనీలో బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌లో ఏర్పాటైన ఎస్‌ఐఎస్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ కూడా వాటాదారు. ఎన్నికల కమిషన్‌కు దాఖలుచేసిన అఫిడవిట్‌లో ఆర్‌కే సిన్హా తన భార్య రెండు విదేశీ కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే సెబీ వద్ద 2017లో దాఖలు చేసిన పత్రాల్లో ఈ సమాచారాన్ని ఆయన తెలియజేశారు. దీనిపై సిన్హా ని స్పందన కోరగా ‘‘నేను వారం రోజుల పాటు మౌనవ్రతం పాటిస్తున్నా. అందువల్ల ప్రస్తుతం ఈ ఆరోపణలపై స్పందించలేను’’

ముఖ్యాంశాలు