జగన్ పై మంత్రుల విసుర్లు


Javahar Babu

జగన్ తమకి క్కడ ముద్దులు పెడతాడోనని భయపడి 40 ఏళ్లలోపు మహిళలు ఆయనకు దూరంగా పారిపోతున్నారని రాష్ట్ర ఎక్సయిజ్ శాఖా మంత్రి జవహర్ పరిహసించారు. పాదయాత్ర ముగిసేసరికి వైసీపీ ఖాళీ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పారడైజ్ పేపర్లలో పేరు లేదని జగన్ బుకాయిస్తున్నారని జవహర్ విమర్శించారు. తన అక్రమాస్తులను ఈడీ ఎందుకు జఫ్తు చేసిందో జగన్ చెప్పాలని నిలదీశారు. అసెంబ్లీని బహిష్కరించి జగన్ తప్పు చేశారన్నారు. తొలిసారి కేకలు, అరుపులు లేని అసెంబ్లీని చూడబోతున్నామన్నారు. జగన్‌ను నమ్మే పరిస్థితి లేదు జగన్ రాజకీయ లబ్ధి కోసమే పాదయాత్ర చేస్తున్నారని మంత్రి సుజయ కృష్ణ రంగారావు అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్‌ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. శాసన సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన విపక్షం బాధ్యతను విస్మరించి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ఏమిటని ప్రశ్నించారు.

ముఖ్యాంశాలు