దుకాణం కాదు.. దేవుడి సొమ్ము దోచేశాడు !

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ మేడిపల్లి విజయరాజు నివాసంలో బుధవారం ఎసిబి అధికారులు దాడి చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇతగాడు దేవుడి  సొమ్మును భారీగా మింగేశాడు. రూ.100 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆరు బృందాలుగా ఏసీబీ అధికారులు విజయవాడ, హైదరాబాద్‌లోని ఆయన నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. అతడి నివాసంలో దొరికిన 560 కి పైగా పట్టుచీరలు చూసి వారు నివ్వెరపోయినట్టు సమాచారం. హైదరాబాద్‌, పశ్చిమగోదావరి జిల్లాలో విజయ రాజు వివిధ హోదాల్లో పనిచేశాడని, ఆ సమయంలోనే అనేక అక్రమాలకు పాల్పడి ఈ సొత్తు వెనకేశాడని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో సోదాలు జరిగాయి. రూ.30లక్షల విలువచేసే 563 పట్టుచీరలను తనిఖీ బృందాలు పట్టుకున్నాయి.  ఒక్కోటి రూ.లక్ష నుంచి రూ.2లక్షలు విలువైన పట్టు చీరలు కూడా వీటిలో ఉన్నాయి. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Facebook