పెద్ద నోట్ల రద్దు నల్లధనంపై యుద్ధం .. మోదీ


కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మకంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా నవంబర్‌ 8ని నల్లధన వ్యతిరేక దినంగా భాజపా ప్రకటించింది. పెద్దనోట్ల రద్దు నల్లధనంపై చేపట్టిన యుద్ధం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ‘నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా 125కోట్ల మంది భారత ప్రజలు నిర్ణయాత్మక యుద్ధం చేసి.. గెలిచారు. నల్లధనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను సమర్థించిన ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. పెద్దనోట్ల రద్దుతో చేకూరిన లాభాలపై ఓ లఘుచిత్రం కూడా ప్రధాని మోదీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ప్రతిపక్షాలు ఈరోజును దేశవ్యాప్తంగా నిరసన దినం (బ్లాక్ డే) గా నిర్వహించాలని విపక్ష కాంగ్రెస్‌ పిలుపివ్వగా కొన్ని పార్టీలు మద్దతిచ్చాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం