ప్రధానిపై రాహుల్ మండిపాటు ట్వీటు


పెద్దనోట్లు రద్దు చేసి ఏడాది అయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మండిప‌డ్డారు. నోట్లరద్దు నిర్ణయం అనాలోచితమని, ‘‘విషాదం’’ అనే మాటకు ఇది ఏమాత్రం తక్కువ కాదని వ్యాఖ్యానించారు. బుధవారం ఈమేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘నోట్ల రద్దు ఓ విషాదం. ప్రధాని తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా ఉపాధి కోల్పోయిన కోట్లాదిమంది నిజాయితీపరులైన భారతీయులకు మేము అండగా ఉంటాం’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘ఒక్క కన్నీటి బొట్టు కూడా ప్రభుత్వానికి ప్రమాదకరమే. అయితే మీరు ఇంతటి కన్నీటి సముద్రాన్ని చూసి ఉండరు...’’ అని వ్యాఖ్యానించారు. దీనికి ఏటీఎం ముందు డబ్బు కోసం నిలబడి కంటతడి పెట్టిన ఓ వృద్ధుడి ఫోటో జత చేసారు,

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం