మాల్యా హాజరుకు పాటియాలా కోర్టు ఆదేశం


Vijay Malya

వేలకోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా డిసెంబరు 18లోగా న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని దిల్లీలోని పాటియాలా హౌజ్‌ కోర్టు ఆదేశించింది. అలా హాజరుకాకపోతే అతడిని ప్రకటిత అపరాధిగా ప్రకటిస్తామని హెచ్చరించింది. ఫెరా ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో మాల్యాను ప్రకటిత అపరాధిగా ప్రకటించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బుధవారం ఈ న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది. దీనిపై అత్యవసర విచారణ జరిపిన చీఫ్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ దీపక్‌ శెర్వాత్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఫెరా ఉల్లంఘన కేసులో మాల్యా హాజరు కావాలని అనేకసార్లు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినా మాల్యా హాజరుకావడం లేదు. దీంతో ప్రకటిత అపరాధిగా ప్రకటించాలని ఈడీ కోరింది. పలు కేసుల్లో మాల్యాపై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. మాల్యాను ఇటీవల లండన్‌లో అరెస్టు చేసినా నిమిషాల్లోనే బెయిల్‌ పొందాడు.

ముఖ్యాంశాలు