వంతల రాజేశ్వరిపై చర్యకు వైకాపా ఎమ్మెల్యేల డిమాండ్


వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు బుధవారం శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును కలిశారు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను వారు కోరారు. ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తాము ఇచ్చిన ఫిర్యాదులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. వంతల రాజేశ్వరి ఈ నెల 4న టీడీపీలో చేరారు. తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని చంద్రబాబు విపక్ష సభ్యులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. దేశంలో ప్రతిపక్ష సభ్యులతో నడుస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబుదేనని ఎద్దేవాచేశారు.