9న హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు


evm

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు రేపు(గురువారం) జరగనున్నాయి. ఇందుకు అన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మొత్తం 7,525 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసారు. 50లక్షల 25 వేల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు ఈసీ తెలిపింది. రాష్ట్రంలో 68 శాసనసభ స్థానాలకు గానూ 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్‌ మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగతుంది. పోలింగ్‌ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 17,850 సిబ్బందితో భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్‌ ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాకా ఇప్పటిదాకా కోటి ముప్పై లక్షల రూపాయల డబ్బును, 2.35 లీటర్ల మద్యం, పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పుష్పిందర్ రాజ్‌పుత్‌ తెలిపారు.

ముఖ్యాంశాలు