ఈయనే భారత దేశపు తొలి ఓటరు

ఈ ఫొటోలో ఉన్నాయన పేరు శ్యామ్ శరణ్ నేగి.. ఈయన వయసు 101ఏళ్లు. హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ఇవాళ ఈయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కల్పా పోలింగ్‌ కేంద్రంలో నేగి ఓటు వేశారు.  పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చిన నేగిని అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతించారు. ఈ వయస్సులోనూ ఆయన స్వయంగా వచ్చి ఓటు వేయడం ఎందరికో స్ఫూర్తి. స్వాత్రంత్యం వచ్చిన మొదట్లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు వేసిన మొట్టమొదటి భారతీయుడు నేగి. అందుకే ఆయన భారత తొలి ఓటర్ గా గుర్తింపు పొందారు. 1952 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు కురుస్తుందన్న కారణంగా ఐదు నెలల ముందే అంటే 1951 అక్టోబర్‌లోనే  ఈ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో మండి పార్లమెంట్‌ నియోజకవర్గంలో నేగి ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

Facebook
Twitter