కాష్ బ్యాక్ తో షాకిచ్చిన జియో


jio

రిలయన్స్‌ జియో ఇతర టెలికాం సంస్థలకు మరో షాకిచ్చింది. ఉచిత ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్న జియో ఇప్పుడు ‘ట్రిపుల్‌ క్యాష్‌ బ్యాక్‌’ ఆఫర్‌ ప్రకటించి అబ్బురపరుస్తోంది. రూ.399 అంతకన్నా ఎక్కువ రీఛార్జ్‌ చేసుకున్న వారికి మూడురెట్లు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ ఇచ్చింది, అంటే దీనిపై అత్యధికంగా రూ.2,599 వరకూ క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు. ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కింద 100శాతం క్యాష్‌బ్యాక్‌ వోచర్లను పొందవచ్చు. ప్రతీ రూ.399 అంతకన్నా ఎక్కువ రీఛార్జ్‌ చేసుకున్న వారికి రూ.400 విలువ చేసే వోచర్లు ల‌భిస్తాయి. రూ.300 ఇన్‌స్టాంట్‌ క్యాష్‌ బ్యాక్‌ వెంటనే ఖాతాలోకి వచ్చి చేరుతుంది. అమెజాన్‌ పే, యాక్సిస్‌ పే, మొబిక్విక్‌, పేటీఎం, ఫోన్‌పే వంటి డిజిటల్‌ పేమెంట్‌ వ్యాలెట్ల ద్వారా రీఛార్జ్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అయితే ఇది జియో ప్రైమ్‌ సభ్యులకు మాత్రమే వర్తిస్తుందని, నవంబర్‌ 10 నుంచి 25 వరకూ ఆఫర్‌ చెల్లుబాటులో ఉంటుందని జియో వర్గాలు తెలిపాయి.

ముఖ్యాంశాలు