తమిళనాట మళ్ళీ  ఐటీ హల్ చల్


jaya tv

మరోసారి తమిళనాడులో ఐటీ దాడుల అలజడి రేగింది. అన్నాడీఎంకే అధికారిక మీడియా జయ టీవీ కార్యాలయం, పలువురు శశికళ బంధువుల నివాసాల్లో గురువారం ఐటీ తనిఖీలు మొదలయ్యాయి. తమిళనాడు, దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఏకంగా 187 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయని సమాచారం. చెన్నై టీనగర్‌లో శశికళ మేనకోడలు కృష్ణప్రియ ఇల్లు, శశికళకు చెందిన జాస్‌ సినిమా హాల్ లో కూడా తనిఖీలు చేపట్టారు. పన్నుల ఎగవేత, డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు తదితర ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు మొదలైనాయి. జయలలిత మరణం తర్వాత జయ ఛానల్‌ను శశికళ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్నారు. ఆమె మేనల్లుడు వివేక్‌ జయరామ్‌ ఈ టీవీకి ఎండీ. ఇటీవల అన్నాడీఎంకేలో చీలికలు రావడం, తదుపరి అవి విలీనం కావడం తెలిసిందే. అయితే ఆ తర్వాత శశికళ, ఆమె కుటుంబసభ్యులను పార్టీ నుంచి వేలి వేశారు. దీంతో జయటీవీ పై శశికళ, అన్నాడీఎంకే మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ సోదాలు చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యాంశాలు