పొరుగుదేశాలతో సంబంధాలు బాగుండాలి


పొరుగుదేశాలతో సంబంధాలు పొరుగింటివారితో ఉన్నట్లే చక్కగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. కోల్‌కతా, ఢాకా మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో కలిసి అయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ కొత్త రైలు ద్వారా భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య రాకపోకలకు ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ వ్యవహారాల పరంగా మరింత సులభతర వాతావరణం నెలకొంటుందని అన్నారు. అలాగే ఈ రైలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని తెలిపారు.

ముఖ్యాంశాలు