మళ్ళీ మార్కెట్లోకి లాంబ్రెట్టా


‘లాంబ్రెట్టా’ 90వ దశకం వారికి ఈ పేరు చాలా పరిచయమే కాక ఇష్టం కూడా. 1950 - 90 వరకూ లాంబ్రెట్టా స్కూటర్‌ ప్రపంచ రోడ్లను ఏలిందంటే అతిశయోక్తి లేదు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు కారణంగా ఈ కంపెనీ స్కూటర్‌ ఆ తర్వాత అదృశ్యమైంది. అయితే మళ్ళీ 20 ఏళ్ల తర్వాత లాంబ్రెట్టా స్కూటర్‌ మార్కెట్లోకి వస్తోంది. ఇటలీలోని మిలాన్‌లో నిర్వహించిన మోటార్‌ వాహనాల ప్రదర్శన కార్యక్రమం (ఈఐసీఎంఏ)లో లాంబ్రెట్టా వీ50, వీ125, వీ200 స్కూటర్లు ప్రదర్శించారు. తైవాన్‌లో తయారు చేస్తున్న ఈ వాహనాల అమ్మకాలు యూరప్‌లో వచ్చే ఏడాది జూన్‌ నుంచి మొదలవుతాయి. మన దేశంలో 2019లో సేల్స్ మొదలవుతాయి. వీ50 మోడల్‌లో 49.5 సీసీ ఇంజిన్‌, వీ 125లో 124.7 సీసీ ఇంజిన్‌, వీ 200లో 168.9 సీసీ ఇంజిన్‌ ఉంటాయి.

ముఖ్యాంశాలు