శ్రీవారి సన్నిధిలో హోటళ్ల దోపిడీకి చెక్


తిరుమల క్షేత్రంలో భక్తులను దోచుకుంటున్న హోటళ్ల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. కొండమీద వివిధ హోటళ్లలో తినుబండారాల ధరలు తగ్గాయి. ఇప్పటి వరకూ రూ.25 పలికిలిన రెండు ఇడ్లీల ధర రూ.7.50కు, రూ.15 అమ్మిన టీ రూ.5కు ఇప్పుడు దొరుకుతున్నాయి. భోజనం ధర రూ.౧౦౦ నుంచి రూ.31 కి తగ్గింది. ఇలా అన్ని ఆహార పదార్థాల ధరలు సగానికిపైగా తగ్గిపోయాయి. ఈ ధరలను ఇపుడు అన్ని హోటళ్ల ముందు పట్టికల్లో ప్రదర్శిస్తున్నారు. పట్టికలో ధరల కంటే ఎక్కువకు అమ్మితే ఫలానా వారికి ఫిర్యాదు చేయాలని ఫోన్‌ నెంబర్లు కూడా వేశారు. తిరుమలలో హోటళ్ల తీరు వలన భక్తులు దోపిడీకి గురవుతున్నారంటూ కొన్ని ప్రజాసంఘాలు ఉమ్మడి హైకోర్టులో ఫిర్యాదు చేశాయి. దీనిపై ఇటీవల కోర్టు తితిదే ఉన్నతాధికారులను మందలించింది. కొండపైకి వచ్చే భక్తుల నుంచి హోటళ్లు దారుణంగా వసూలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని తితిదే ఉన్నతాధికారులను ప్రశ్నించింది. వెంటనే దీనికి అడ్టుకట్ట వేసేందుకుచర్యలు తీస్కుని తమకి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనికి ప్రతిస్పందనగా తితిదే అధికారులు ఈ తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. హోటల్‌ యజమానులు ఇపుడు తితిదే తమపై అద్దెల భారం తగ్గించాలని కోరుతున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం