గరుడవేగ కు సీక్వెల్ తీస్తా : రాజశేఖర్


Rajasekhar, Actor

ప్రముఖ నటుడు రాజశేఖర్ పిఎస్వి గరుడ వేగ సినిమా సక్సెస్ తో మంచి జోరు మీదున్నారు. ఈ జోరులోనే ఆయన ఈ సినిమాకి సీక్వెల్ తీస్తానని ప్రకటించారు. అలాగే అల్లరి ప్రియుడు వంటి కమర్షియల్‌ సినిమా తీసేందుకు కూడా కసరత్తు చేస్తున్నానని చెప్పారు. ‘గరుడ వేగ’ సినిమా విజయోత్సవ సభ విజయవాడ ట్రెండ్‌ సెట్‌మాల్‌లోని కేపిటల్‌ సినిమాలో జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఇటీవల తన తల్లి, బావమరిది చనిపోయారని.. ఆ బాధ నుంచి ఈ చిత్ర ఘానా విజయం ఊరట ఇచ్చిందని పేర్కొన్నారు. జీవిత మాట్లాడుతూ తన తల్లి, అత్తగారి ఊరు విజయవాడేనని, సత్యనారాయణ పురంలోనే ఉండేవారమని అన్నారు. చిత్ర దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌ మాట్లాడుతూ హైదరాబాదుకు దీటుగా విజయవాడ అభివృద్ధి చెందడం సినీవర్గాలను ఆకట్టుకుంటోందన్నారు. రాజశేఖర్‌ దంపతుల కుమార్తెలు శివాని, శివాత్మిక, అలంకార్‌ ప్రసాద్, సురేష్‌ మూవీస్‌ ప్రతినిధి ముళ్లపూడి భగవాన్, కేపిటల్‌ సినిమాస్‌ మేనేజర్‌ కె.కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు