నిజాం హీరోగా తెలంగాణ చరిత్ర రాయిస్తాం : కేసీఆర్


KCR

సమైక్య పాలనలో నిజాం చరిత్రను పూర్తిగా వక్రీకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆరోపించారు. అందుకే తెలంగాణ చరిత్రను కొత్తగా రాయిస్తామని అసెంబ్లీలో చెప్పారు. నిజాం ఆభరణాలను కేంద్రం నుంచి హైదరాబాద్‌కు తీసుకొ చ్చేందుకు కృషి చేస్తామన్నారు. తనని కొందరు నిజాంతో పోలుస్తున్నారని పేర్కొంటూ నిజాం చేసిన మంచి పనులను గుర్తించాలన్నారు. నిజాంసాగర్‌ను నిర్మించింది ఎవరని ప్రశ్నించారు. విలీనం తర్వాత కూడా ఆర్ధోపెడిక్‌ ఆస్పత్రికి స్థలం ఇచ్చి సొంత నిధులతో నిజాం నిర్మించారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. చైనా యుద్ధం తర్వాత అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రికి నిజాం ఆరు టన్నుల బంగారాన్ని దేశం కోసం ఇచ్చారని చెప్పారు. నిజాం మంచితనం గురించి చర్చించుకుంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యాంశాలు