ముస్లిం రిజర్వేషన్లు తెచ్చే తీరతాం - కేసీఆర్


KCR

తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను సాధించి తీరుతామని, తమిళనాడు తరహాలో పార్లమెంట్‌ ఆమోదంతో తొమ్మిదో షెడ్యూలులో దీన్ని చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. దీనికి ప్రధాని మాట ఇచ్చారని కూడా చెప్పారు. గురువారం శాసనసభలో మైనార్టీ సంక్షేమంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఒకవేళ కేంద్రం ఇవ్వకుంటే సుప్రీంకోర్టులో పోరాడతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఆత్మవిశ్వాసంతో సాధించానో అదే ఆత్మవిశ్వాసంతో ముస్లిం రిజర్వేషన్లు కూడా సాధిస్తామన్నా రు. అవసరమైతే దీనికోసం అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్తామని తెలిపారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తెరాస ఎంపీలు ముస్లిం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తారన్నారు. ముస్లింలు దుస్థితిలో ఉండటానికి కాంగ్రెస్సే కారణమన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ముస్లింలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కోసం కృషి చేస్తామన్నారు. చర్చిల్లోని పాస్టర్లు, రెవరెండ్‌లకు సాయం అందిస్తామన్నారు.

ముఖ్యాంశాలు