28 శాతం శ్లాబు నుంచి 177 వస్తువులకు మినహాయింపు

వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరోసారి సమీక్ష నిర్వహించింది. జీఎస్టీ ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సవరణలను చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి 28శాతం శ్లాబులో ఉన్న 177 వస్తువులను తప్పించారు. గువహటిలో జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. చాక్లెట్లు, చూయింగ్‌గమ్‌లు, షాంపూలు, డియోడ‌రంట్‌లు, షూ పాలిష్‌, డిటర్జెంట్‌, పోషకాహార పానీయాలు, కాస్మెటిక్స్‌ వీటిలో ఉన్నాయి. దీంతో వీటి ధరలు తగ్గనున్నాయి. దీంతో ఇక  కేవలం 50 వస్తువులను మాత్రమే 28శాతం శ్లాబులో ఉంచారని తెలిసింది.  ఇప్పటివరకూ 227 వస్తువులు 28శాతం శ్లాబులో ఉండేవి. ఫిట్‌మెంట్‌ కమిటీ 62 వస్తువులను హైయెస్ట్  శ్లాబు నుంచి తొలగించాలని సిఫారసు చేయగా, జీఎస్‌టీ మండలి అంతకన్నా ఎక్కువ వస్తువులనే తొలగించింది. దీంతో చాలా వస్తువులు 18శాతం శ్లాబులోకి వస్తాయి. అయితే పెయింట్స్‌, సిమెంట్‌, విలాస వస్తువులు, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్‌ కండీషనర్లు 28శాతం శ్లాబులోనే ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది.