అమెరికా-దక్షిణ కొరియా నావికాదళ విన్యాసాలు


ఉత్తర కొరియాకు హెచ్చరికగా అమెరికా మిత్రదేశంతో కలసి నేవీ డ్రిల్ మొదలుపెట్టింది. కొరియా ద్వీపంపై యుద్ధ విమానాలతో విన్యాసాలు చేయించి ఇదివరకే సత్తా చాటిన అమెరికా ఇపుడు ఈ డ్రిల్‌ ద్వారా తన నావికా, సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించింది. దక్షిణకొరియా తూర్పు తీరంలో అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త నావికాదళ విన్యాసాలు మొదలయ్యాయి. యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రేగాన్‌, దియోడోర్‌ రూస్‌వెల్ట్‌, నిమిజ్‌ బ్యాటిల్‌ గ్రూప్‌లు సముద్ర జలాల్లోకి దూసుకువెళ్లాయని దక్షిణకొరియా మిలిటరీ తెలిపింది. నాలుగు రోజులపాటు ఈ డ్రిల్‌ జరుగుతుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసియా పర్యటనలో ఉండగానే ఈ డ్రిల్‌ మొదలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తరకొరియా ఎజెండాతో ట్రంప్ జపాన్, దక్షిణ కొరియా, చైనా దేశాల పర్యటనకు వచ్చిన విషయం విదితమే.

ముఖ్యాంశాలు