కాలుష్య నివారణకు ఎలక్ట్రికల్ బస్సులు


ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాలుష్య నివారణకు ఈ ప్రాజెక్ట్ ను ఉద్దేశించారు. పైలట్‌ ప్రాజెక్టు కింద అమరావతి, విశాఖపట్నం, తిరుమలలో ఈ ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. శుక్రవారం అమరావతిలో దీనికి సంబంధించి నిపుణులతో ఆయన సమీక్షించారు. దీనికి ఓ ప్రణాళికను తితిదే బోర్డు రూపొందించి ప్రభుత్వానికి ఇప్పటికే అందచేసింది అని చెప్పారు. హైదరాబాదు కేంద్రంగా గోల్డ్‌స్టోన్‌ సంస్థ రూపొందించిన ఎలక్ట్రికల్‌ బస్సును గత ఆదివారం ప్రదర్శించారు. మూడు గంటల పాటు ఛార్జింగ్‌ చేస్తే 300 కిలోమీటర్లు ఇది నడుస్తుంది. జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థ ద్వారా ప్రయాణించే ఈ బస్సులో వైఫై సేవలు, సీసీ కెమెరాలు తదితర సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. తిరుమల దివ్యక్షేత్రానికి వాహనాల రాకపోకలు నిత్యం పెరిగిపోతున్నాయి. దీంతో ఇవి విడుదల చేస్తున్న పొగతో వాయుకాలుష్యం పెరిగిపోతున్నది. ఇది భక్తులకు అసౌకర్యమే కాక శేషాచలంపై ఉన్న అరుదైన జీవజాలానికి సైతం ముప్పు వాటిల్లుతోంది. పర్యావరణవేత్తలు దీనిపై ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు తితిదే కాలుష్య రహిత వాహనాలు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. తిరుమలలో ఎలక్ట్రికల్‌ వాహనాలు అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థ రూపురేఖలు మారతాయి. తిరుపతి నుంచి వచ్చే వాహనాలు అన్నిటీఈ ఒకేచోట ఆపేసి అక్కడి నుంచి ఎలక్ట్రికల్‌ వాహనాలలో భక్తులను తిరుమల తరలిస్తారు. ఇది అమల్లోకి వస్తే తిరుమలలో నడుస్తున్న దేవస్థానం ధర్మరథాలను కూడా ఎలక్ట్రికల్ వాహనాలనే నడుపుతారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం