చైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా?


చైనా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందా? ఈమాట అంటే ఎవరైనా సరే నవ్వడం ఖాయం. ఎందుకంటే చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న దేశం. సాంకేతికంగా చాలా పురోగతి సాధించింది. అటువంటి చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నదని చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ జౌ జియోచౌన్‌ అన్నారు. 15ఏళ్లుగా చైనా సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్‌గా జౌ ఉన్నారు. త్వరలో ఆయన రిటైర్‌ అవుతారు. దేశ ఆర్థిక వ్యవస్థపై జౌ రాసిన తాజా వ్యాసాన్ని చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ వెబ్‌సైట్లో పెట్టారు. తీవ్రస్థాయి అప్పుల పరిమాణం చైనా ఆర్థిక వ్యవస్థను చిక్కుల్లో పెడుతోందని ఆయన అన్నారు. అటువంటి సమస్యలను నివారించేందుకు ఆర్థిక సంస్కరణలను బలోపేతం చేయాల్సి ఉందని సూచించారు. అప్పుల్లో కూరుకున్న పలు కంపెనీలను తీసేయాలని ఆయన సూచించారు. అప్పులు, వాటి వడ్డీ కట్టలేని స్థితిలో ఉన్న సంస్థలు అలాగే కొనసాగితే అది దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధికి ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం