మజ్లీస్ ఏం చెబితే అది చేసేస్తారా?


Kishan Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి శాసనసభాపక్షనేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. నిజాం చరిత్రను తిరగ రాయిస్తామని ప్రకటించడానికి కేసీఆర్ ఎవరని అయన ప్రశ్నించారు. శుక్రవారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇది తెలంగాణనా, ఇది మజ్లిస్‌ పార్టీ తెలంగాణనా అని రాష్ట్ర ప్రజలు ఆలోచించాలన్నారు. మజ్లిస్‌ పార్టీ ఏది చెబితే అది మరు నిమిషంలో ప్రభుత్వ ఉతర్వుగా వస్తున్నదని ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు చూస్తుంటే అసలు తెలంగాణ ప్రాంతం దేశంలో విలీనం కావడమే తప్పు అనే అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తోందని మండిపడ్డారు. ఒవైసీల కనుసన్నల్లో పాలన సాగుతున్నదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం