సినీ గాయని రాధిక మృతి


గాయని రాధిక శుక్రవారం ఉదయం చెన్నై పాలవాక్కంలోని తన నివాసంలో మృతి చెందారు. ఆమె వయసు 47 సంవత్సరాలు. బావ-బావమరిది చిత్రంలో బావలు సయ్యా పాట పాడింది ఆమే. తెలుగులో ఎన్నో పాటలు పాడిన రాధిక ఆకస్మికంగా వచ్చిన గుండెపోటుతో మరణించారు. తిరుపతిలో జన్మించిన రాధిక తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 200కు పైగా పాటలు పాడారు. 2004 నుంచి ఆమె సినీరంగానికి దూరంగా ఉన్నారు. ఆమె మృతి పట్ల సంగీత దర్శకులు కోటి, మణిశర్మ గాయకులు మనో సంతాపం తెలిపారు. శనివారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

ముఖ్యాంశాలు