హోమ్ శాఖలో సంస్థాగత మార్పులు


ఉగ్రవాదంవైపు యువతను ఆకర్షిస్తున్న సంస్థలకు చెక్ చెప్పడం కోసం, సైబర్‌ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధీనంలో కొత్తగా రెండు విభాగాలు ఏర్పాటయ్యాయి. దీనితో ఇకపై ఇకపై హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పని చేసే విభాగాల సంఖ్య 18 కి పెరిగింది. హోం శాఖ కింద పనిచేసే పలు విభాగాల్లో శుక్రవారం కొన్ని మార్పులు జరిగాయి. ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన వ్యూహాలను రచించేందుకు సీటీసీఆర్‌ (కౌంటర్‌ టెర్రరిజం, కౌంటర్‌ ర్యాడికలైజేషన్‌)ను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ మోసాలు, హ్యాకింగ్‌ వంటి సైబర్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు సైబర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ (సీఐఎస్‌) విభాగాలు నూతనంగా ఏర్పాటయ్యాయి. కొన్ని విభాగాలను ఒకదానిలో ఒకటి విలీనం చేశారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం