అక్కినేని ఇంట ఘనంగా రిసెప్షన్


అక్కినేని నాగచైతన్య, సమంత వివాహానంతర విందు (రిసెప్షన్‌)ను హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. అక్కినేని కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. ఒకప్పటి హీరో కృష్ణ దంపతులు, జయసుధ, నరేష్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, శివాజీ రాజా, ఆర్‌. నారాయణ మూర్తి, ఉత్తేజ్‌ తదితరులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. అక్టోబరు 6న సమంత, నాగ చైతన్య వివాహాన్ని గోవాలో జరిపారు. అయితే ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. దీంతో ఇప్పుడు ప్రముఖులకు విందు ఏర్పాటు చేశారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం