అర్బన్ ఉపాధ్యాయులకు వసంత పురస్కారాలు


రాజమహేంద్రవరం: పీపుల్స్ యూత్ అసోసియేషన్ (చిత్తూరు) ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ ఉపాధ్యాయులు "వసంత పురస్కారాలు" అందుకున్నారు. స్థానిక నివేదిత కిషోర్ విహార్ ఎయిడెడ్ ప్రాథమిక (ఇంగ్లీష్ మీడియం )పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వరాహగిరి కృష్ణ మోహన్ "విద్యా విభూషణ ' అవార్డునూ, గాంధీ పురం -2 హైస్కూల్ సైన్సు ఉపాధ్యాయులు దాసరి శివ సత్యమూర్తి "విశిష్ట ఆచార్య" అవార్డునూ అందుకున్నారు. చిత్తూరు నగర మేయర్ కదారి హేమలతా ప్రవీణ్ సన్మాన సారథ్యం వహించారు. పీపుల్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఆర్ ఎస్ హేమవతి, కార్యదర్శి సత్యవతి భరణి , జిల్లా పరిషత్ చైర్మన్ గీర్వాణి చంద్ర ప్రకాష్ తదితరులు హాజరయ్యారు. చిత్తూరులో సన్మానం అందుకున్న నగర ఉపాధ్యాయులకు రాజమహేంద్రవరం అర్బన్ రేంజ్ డి ఐ బి దిలీప్ కుమార్, స్కూల్స్ సూపర్ వైజర్ పులుగుర్త దుర్గాప్రసాద్ తదితరులు అభినందనలు తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం