ఆ ప్రధానమంత్రి తప్పిపోయారు!


Hariri

లెబనాన్‌ ప్రధాని సాద్‌ హరిరి ఇటీవల సౌదీ అరేబియా నుంచి ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేసిన అనంతరం కనిపించడం లేదట. దీంతో లెబనాన్‌ ప్రజలు, రాజకీయ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. హరిరి లెబనాన్ తిరిగి రాలేదని, సౌదీ అరేబియాలోనే కిడ్నాప్‌కు గురయ్యారంటూ ప్రచారం సాగుతుండడంతో తాజాగా లెబనాన్‌ అధ్యక్షుడు మైఖెల్‌ అవాన్‌ సౌదీ అరేబియాతో ఈ విషయమై సంప్రదింపులు జరిపారు. తమ ప్రధాని ఇంతవరకూ స్వదేశానికి తిరిగిరాలేదని, ఎందుకో తెలిస్తే చెప్పాలని కోరారు. ఇటీవల సౌదీ వెళ్లిన హరిరి నవంబర్‌ 4న రియాద్‌లోని ఓ టెలివిజన్‌ ఛానల్‌ ద్వారా మాట్లాడుతూ రాజీనామాను ప్రకటించారు. లెబనాన్‌పై ఇరాన్‌ ఆధిపత్యం సాగుతున్నదని, తన తండ్రిలాగే తనను కూడా చంపేస్తారేమోనని ఆందోళన కలుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన తర్వాత ఆయన మళ్ళీ లెబనాన్‌ తిరిగి వెళ్లలేదు. దీంతో ఆయన ఏమయ్యారనే విషయం మిస్టరీగా మారింది. సౌదీలో హరిరి కిడ్నాప్‌కు గురయ్యారంటూ వదంతులు వ్యాపించాయి. అందుకే లెబనాన్‌ అధ్యక్షుడు మైఖెల్‌ అవాన్‌ సౌదీ రాజుతో మాట్లాడారు. అదీ గాక హరిరి రాజీనామాను లెబనాన్ అధ్యక్షుడు ఇంకా ఆమోదించలేదు. దీంతో ప్రధాని జాడ తెలియక లెబనాన్ తల్లడిల్లుతున్నది.

ముఖ్యాంశాలు